యువత క్రీడలు రాణించాలి

24-11-2026 | 07:30pm

క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసిన ఉపసర్పంచ్‌ కాసర్ల పవిత్ర సురేష్‌..

కోనరావుపేట, నవంబర్‌ 24 (విజయక్రాంతి): యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మామిడిపల్లి గ్రామ ఉపసర్పంచ్‌ కాసర్ల పవిత్రసురేష్‌(Vice Sarpanch Kasarla Pavithra Suresh) ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తన స్వంత ఖర్చులతో గ్రామంలోని క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి విజయాలు సాధించాలని సూచించారు.అలాగే మామిడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మామిడిపల్లి వీబీఏ క్రీడా జట్టు సభ్యులు క్రీడా దుస్తులను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిమ్యాల శ్రీనివాస్‌, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీకాంత్‌, మైకేల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు