రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

24-11-2026 | 07:25pm

ఘట్ కేసర్, నవంబర్ 24 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఘట్‌కేసర్(Ghatkesar) పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ చౌరస్తా వద్ద ఘట్‌కేసర్ ఇన్ స్పెక్టర్ పి. కిరణ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, ట్రాఫిక్ ఏఎస్‌ఐ, పోలీస్ సిబ్బందితో కలిసి ఎర్రీవ్ అలివ్-రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ఈసందర్భంగా వాస్తవంగా జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలను ఉదహరిస్తూ, ప్రమాదాల వల్ల ప్రాణనష్టం సంభవించడమే కాకుండా బాధిత కుటుంబాలు ఎదుర్కొనే తీవ్ర పరిణామాలు, మానసిక వేదన, కుటుంబాలపై పడే ప్రభావాన్ని వివరించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు