ధర్నాను జయప్రదం చేయండి
ఆర్మూర్, నవంబర్ 24 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం విధానాలు నిరసిస్తూ ఈనెల 26న నిజామాబాద్ లో చేపట్టే ధర్నాను విజయ వంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్(Pallapu Venkatesh) కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయకపోవడం, మూడు నల్ల చట్టాలను దొడ్డి దారిన అమలు చేయటం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నేరుగార్చే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని, తొలగించిన ఓటర్లను సర్వే చేసి యధావిధిగా చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్టాన్ని కరువు రాష్టం గా ప్రకటించి నిధులు కేటాయించాలి పార్లమెంట్ లో రైతులకు మద్దతు ధరలపై చట్టం చేయాలని, నిజామాబాదు లో షుగర్ ఫ్యాక్టరీ, సారంగాపూర్ సహకార ఫ్యాక్టరీని తెరవాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈనెల 26న నిరసన కార్యక్రమాన్ని రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, తూర్పు నడిపి రాజన్న, ఎర్రన్న, భోజన్న, కుమ్మరి మోహన్, తెలుగు గంగారం బక్కన్న, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.