కరెంట్ వైర్లు తగిలి హార్వెస్టర్ దగ్ధం
24-11-2026 | 07:27pm
చేగుంట నవంబర్ 24 (విజయక్రాంతి): చేగుంట మండలం పోలిమామిడి కిష్టాపూర్ గ్రామ పరిధిలో విద్యుత్ వైర్లు తగలడంతో హార్వెస్టర్ దగ్ధమైన(Harvester Caught Fire) ఘటన మంగళవారం చోటుచేసుకుంది. హార్వెస్టర్ డ్రైవర్ మహేష్ నడుపుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగి హార్వెస్టర్ దగ్ధమైనది. ఈ హార్వెస్టర్ యజమాని ఎల్లారెడ్డిగా తెలిసింది. ఈ ఘటనతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.