జోనల్ సైన్స్ ఫెయిర్‌లో చివ్వెంల గురుకుల విద్యార్థుల ప్రతిభ
‘అవర్ ఎర్త్ – అవర్ రెస్పాన్సిబిలిటీ’ ప్రాజెక్టుకు మూడో బహుమతి
చివ్వెంల, నవంబర్ 24 (విజయక్రాంతి): జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ పోటీల్లో చివ్వెంల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల(Chivvemla Telangana Social Welfare Gurukula School)(బాలుర) విద్యార్థులు ప్రతిభ కనబరిచి మూడో బహుమతి సాధించారు. నల్లగొండ జిల్లా జీ.వి. గూడెం గురుకుల పాఠశాలలో ఈ నెల 17 నుంచి 19 వరకు నిర్వహించిన 4, 5వ జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో పదో తరగతి విద్యార్థులు సాత్విక్, సంజయ్ రూపొందించిన ‘అవర్ ఎర్త్ – అవర్ రెస్పాన్సిబిలిటీ’ ప్రాజెక్టుకు మూడో బహుమతి లభించింది. విజేతలకు రూ.500 నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్లను జిల్లా కోఆర్డినేటర్ శోభారాణి, పాఠశాల ప్రిన్సిపాల్ లలితకుమారి అందజేశారు. విద్యార్థుల విజయంపై చివ్వెంల గురుకుల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.