జనరల్ సెక్రెటరీ నీ కలిసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు

24-11-2026 | 07:22pm

కామారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్(Telangana State Women's Congress) జనరల్ సెక్రెటరీగా నియమితులైన గడ్డం హిందూ ప్రియను మంగళవారం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇందుప్రియను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఎందుకు మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చేయాలని కోరారు. మహిళలకు సంక్షేమం సాధికారత కోసం ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటూ మహిళల కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు