18 రోజులుగా కార్యదర్శి లేక ఇబ్బందులు

24-11-2026 | 07:16pm

బెజ్జూర్ నవంబర్ 24 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని(Bejjur Mandal Headquarters) గ్రామపంచాయతీలో విధులు నిర్వహించే గ్రామ కార్యదర్శి గత 18 రోజుల నుండి  లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలుపుతున్నారు. గ్రామపంచాయతీకి వివిధ పనుల కోసం వచ్చిన కార్యదర్శి లేకపోవడంతో కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితిగా మారిందని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.

అంతేకాకుండా గ్రామంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కరువైందని ప్రజలు తెలుపుతున్నారు. కార్యదర్శి లేకపోవడంతో పారిశుద్ధ్య  కార్మికుల జీతాలు, అభివృద్ధి పనుల బిల్లులు సైతం పెండింగ్ పడ్డాయని గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ, పాలకవర్గ  సభ్యులు తెలుపుతున్నారు.

ఇట్టి విషయం గ్రామ కార్యదర్శి వైకుంఠం ను వివరణ కోరగా తాను మెడికల్ లీవ్ లో ఉన్నానని సమాధానం ఇచ్చారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన కార్యదర్శిని నియమించి గ్రామ సమస్యలను పరిష్కరించేలా చూడాలని గ్రామ సర్పంచ్ సరోజ కోరారు.

మరిన్ని వార్తలు