నీటిని పొదుపుగా వాడాలి

03-11-2026 | 07:38pm

రాజాపూర్ నవంబర్ 3 : ప్రజలు మంచినీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ట్రైనీ కలెక్టర్ సాయి శివాని(Trainee Collector Sai Shivani) అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ట్రైని కలెక్టర్ పర్యటించి ఎలినో ప్రభావం వలన తీసుకోవసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. త్రాగునీటిని, కరెంటు వాడకం పై బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

గ్రామంలో కమ్యూనిటీ సోప్ పీట్స్ ప్రతి ఒక్కరు నిర్మించాలని సూచించారు. గ్రామంలో అర్హులైన   పేదలందరికీ ఉపాధి హామీ పనులను కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ విజయలక్ష్మి,సర్పంచ్  సంతోష వెంకటేష్,పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్, డిప్యూటీ సర్పంచ్ రామచందర్,ఫీల్డ్ అసిస్టెంట్ జైపాల్ రెడ్డి,వార్డు సభ్యులు రహిమత్ పాషా,సంతోష్ నాయక్, శ్రీశైలం, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు