చిన్నారులకు పోషకాహారం అందించాలి

21-09-2026 | 08:38pm

కోనరావుపేట సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సర్పంచ్‌ అంబటి చైతన్య (Sarpanch Ambati Chaitanya)సూచించారు. శవంగలపల్లె గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ టీచర్‌ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్‌ మాసం కార్యక్రమానికి ఆమె హాజరైయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిన్నారుల పరిశుభ్రత, ఆరోగ్యం, మంచి అలవాట్లపై తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.

పోషకాహారం తీసుకోవడం ద్వారా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గంగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు