సీఎం సభను విజయవంతం చేయాలి
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సభా వేదికను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రాజన్న సిరిసిల్ల 28 సెప్టెంబర్ (విజయక్రాంతి): ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం సభ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సభ కీలకంగా ఉంటుందన్నారు.
సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.