యువత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి
కనగర్తి యువ న్యాయవాది సింగం పర్శరాంకు ఘన సన్మానం.
కోనరావుపేట నవంబర్ 23 (విజయక్రాంతి): యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు(Congress Mandal President) మారుపాక శంకర్, సింగిల్‌విండో డైరెక్టర్ రావులపెల్లి మహిపాల్‌రెడ్డి అన్నారు.కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన సింగం పర్శరాం తెలంగాణ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న సందర్భంగా గ్రామస్తులు సోమవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, దానిని సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. యువత ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వంగపెల్లి శేఖర్, నాయకులు బడే అంజి, దేవరాజు, కాసర్ల మల్లారెడ్డి, తిరుపతి, లింగయ్య, వేణు, రూపకిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.