ఆరోగ్య విబాగం జిల్లా అధ్యక్షులుగా గుండేటి తిరుపతి
చొప్పదండి,(విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) కరీంనగర్ జిల్లాఆరోగ్య విబాగం జిల్లా అధ్యక్షులుగా గుండేటి తిరుపతి చొప్పదండి మండలం(Choppadandi Mandal) మంగళపల్లి గ్రామానికి చెందిన గుండేటి తిరుపతి నియమిస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President Kalvakuntla Kavitha) నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా గుండేటి తిరుపతి మాట్లాడుతూ... పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవితక్క గారికి, జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ గారికి పార్లమెంట్ ఇంచార్జి లింగంపేల్లి నాగరాజు గారికి జిల్లా నాయకులు మ్యాకల తిరుపతి గారికి మరియు జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు