కోనరావుపేటలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
నూతనంగా జిల్లా స్థాయి పదవులు పొందిన నాయకులకు ఘన సన్మానం.
కోనరావుపేట అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) మండల అధ్యక్షుడు మిర్యాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం(Mandal Executive Committee Meeting) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ కో-కన్వీనర్ ఆడెపు రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లాస్థాయిలో వివిధ మోర్చాల్లో నూతనంగా పదవులు పొందిన నాయకులను కోనరావుపేట మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎంపికైన జింక వెంకటి, జిల్లా ఎస్టీ మోర్చా నాయకుడు అజ్మీరా జయరాం (అజ్మీరా తండా సర్పంచ్), జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి తంగళ్లపల్లి రాములు, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులుగా ఎంపికైన బెంద్రం శ్రీనివాస్, మోత్కూ మోహన్లను నాయకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గొట్టె రాంచంద్రం, మండల ప్రధాన కార్యదర్శులు బైరోగోని సురేష్ గౌడ్, ఎక్కలదేవి జలందర్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, చీకటి మధు, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు అజ్మీరా వినోద్, చల్ల జితేందర్ రెడ్డి, కడ్లర్ల వికాస్, దుర్గం తిరుపతి, పాక మహేష్, గ్రామ శాఖ బూత్ అధ్యక్షులు దుర్ల శంకర్, పొన్నం మహేష్, బాలరాజు, పిల్లి వెంకటేష్, బోయిని నర్షయ్య, అంకమల్ల శంకర్, సుమన్, బోయిని తిరుపతి, అరుణ్, మనోజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.