కొత్త పాలకవర్గాల బాధ్యతల స్వీకరణ
కోనరావుపేట సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రంతో పాటు కొలనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నూతన పాలకవర్గాలు సోమవారం బాధ్యతలు స్వీకరించాయి. 12 మంది డైరెక్టర్లతో నూతన కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోనరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా చేపూరి గంగాధర్, కొలనూర్ సహకార సంఘం చైర్మన్‌గా బొమ్మేనా భాస్కర్‌రావు బాధ్యతలు చేపట్టారు. వీరితో పాటు డైరెక్టర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన చైర్మన్లు మాట్లాడుతూ రైతులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas) సహకారంతో సహకార సంఘాలను మరింత బలోపేతం చేసి రైతులకు అన్ని విధాలుగా సేవలందిస్తామని పేర్కొన్నారు. ఇందుకు పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం నూతన చైర్మన్లు, డైరెక్టర్లను శాలువాలతో సన్మానించారు. సీఈఓలు కేశవులు, రాజేశం నూతన చైర్మన్లకు, డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు.