సుల్తానాబాద్ లో ఐపీఎస్ వేదికగా థాంగ్-టా సమరం
సుల్తానాబాద్, అక్టోబరు, 04 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల(Indian Public School) వేదికగా ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి థాంగ్-టా మార్షల్ ఆర్ట్స్ పోటీలు(District-level Thang-Ta martial arts competitions) ఆదివారం ఉత్సాహంగానిర్వహించారుఅండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు.పోటీలను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్‌కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలుదోహదపడతాయని అన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రమం తప్పకుండా సాధన చేసి ఉన్నతస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మ్యాచ్ రెఫరీలు లింగమూర్తి, గణేష్, కోచ్‌లు,వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్, కుమార్, విష్ణు, సుష్మా రెడ్డి, విజయ్, వికాస్, వెంకటేష్, రాకేష్, వినయ్, సత్యం,శివ , సతీష్, రణధీర్, క్రీడాకారులు పాల్గొన్నారు.