అమ్మవారి సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు
మంథని, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నవరాత్రి ఉత్సవాల (Navaratri Celebrations) సందర్భంగా మంథని ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గామాతలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు (Special Prayers) నిర్వహించారు. మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీ, హనుమాన్ నగర్, గాంధీ చౌక్‌తో పాటు సూరయ్యపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెట్రోల్ బంకు వద్ద ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని ప్రజలు పాడిపంటలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మంథనిని అభివృద్ధి (Development) దిశగా ముందుకు తీసుకెళ్తానన్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు తనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు