కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి అందరు సిద్ధంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క ...
సుల్తానాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క బుధవారం సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు, ఎలి నో నో ప్రభావము పై తీసుకోవలసిన చర్యలపై హైదరాబాద్ సెర్ప్ కార్యాలయం(Hyderabad SERP Office) నుండి వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రాబోయే ఆరు మాసాలలో కరువు పరిస్థితులుఎదుర్కొనడానికి అందరూ సిద్ధంగా ఉండాలని, ఉపాధి హామీ పనులను ఎక్కువ సంఖ్యలో గుర్తించి లేబర్ ఎక్కువ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత మరియు జలసిరి కార్యక్రమాలపై గ్రామపంచాయతీ సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
వివో భవనాలు గ్రామపంచాయతీ భవనాలు అవసరం ఉన్నచోట మంజూరు తీసుకొని త్వరగా పూర్తి చేయాలని, పని పూర్తి చేసిన 15 రోజులలోగా చెల్లింపులు వస్తాయని తెలిపారు. మంత్రి తో పాటు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రిన్సిపల్ కార్యదర్శి పంచాయతీరాజ్ దాన కిషోర్ , కమిషనర్ పంచాయతీరాజ్ దివ్య పాల్గొన్నారు.
సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయం నుండి ఎంపీడీవో దివ్యదర్శనరావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నామిని రాజిరెడ్డి, మండలంలోని గ్రామాల సర్పంచులు, వ్యవసాయ శాఖ అధికారి పైడితల్లి , పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ శాఖల సహాయ ఇంజనీర్లు, వెటర్నరీ డాక్టర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.