శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఆర్డీవో కార్యాలయం(Bodhan RDO office)లో బుధవారం ఉదయం ప్రముఖ తెలంగాణ కవి, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి(Sri Kaloji Narayana Rao Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించిన బోధన్ ఆర్డీవో కార్యాలయ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎం. విజయ కుమారి(RDO M. Vijaya Kumari) కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సమాజంలో కాళోజీ నారాయణరావు పోషించిన పాత్రను ఈ సందర్భంగా సిబ్బంది స్మరించుకున్నారు.
ప్రజల సమస్యలను తన రచనల ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చిన కాళోజీని తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజాకవిగా కొనియాడారు. ఆయన రచనలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక చైతన్యం వంటి అంశాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్డీఓ విజయ కుమారి అన్నారు. సమాజంలో ప్రజల పట్ల బాధ్యత, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు.