స్పీకర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును సస్పెండ్ చేయాలి

09-09-2026 | 07:04pm

డీహెచ్ పీఎస్ జిల్లా కార్యదర్శి పొనంగటి లావణ్య

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును సస్పెండ్ చేయాలని డీహెచ్ పీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి పొనగంటి లావణ్య(DHPS District Secretary Ponangati Lavanya) డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ శాసనసభ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు(MLC Thata Madhu) చేసిన అనుచిత, వ్యక్తిగత వ్యాఖ్యలను దళిత హక్కుల పోరాట సమితి(Dalit Rights Struggle Committee) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను వ్యక్తిగతంగా అవమానించడం శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య విలువలను కించపరచడమేనని అన్నారు. కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే సస్పెండ్ చేసి, వ్యాఖ్యలను ఉపసంహరించుకుని స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఈ సందర్భంగా లావణ్య హెచ్చరించారు.

మరిన్ని వార్తలు