10న జనసేన సమావేశం
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణం కాలేజ్ రోడ్ లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఈ నెల 10వ తేదీన జనసేన పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి,ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ పేర్కొన్నారు. బుధవారం జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దుంపటి శ్రీనివాస్‌తో కలిసి ఆయన మాట్లాడారు. 2014 నుంచి పార్టీలో పని చేసిన సీనియర్ నాయకులతో కలిసి నిర్వహించే ఈ ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలను ఒక వేదిక మీదకు తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఉదయం నుంచే నిర్వహించే పెద్దపల్లి,ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశానికి జనసేన నాయకులు భారీగా తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్లు మంతెన సంపత్,గొట్టిముక్కల నరేష్ రెడ్డి,రాష్ట్ర అధికార ప్రతినిదులు మూల హరీష్ గౌడ్, శివా రెడ్డి,మంచిర్యాల జిల్లా నాయకులు నల్లతీగల మహేష్,వడ్లకొండ జీవన్, విష్ణు, రమేష్, రక్షిత్, సుధాకర్, సాగర్, పవన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు