పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి

09-09-2026 | 06:41pm

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు బకాయి పడిన పెండింగ్ స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం(Telangana Private Degree Colleges Management Association)   ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణంలోని ఫస్ట్ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు అధ్యాపకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  నల్ల బ్యాడ్జీ లను ధరించి మానవ హారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల స్కాలర్షిప్ లను చెల్లించక పోవడం వల్ల కళాశాలలు ఆర్థిక సంక్షోభం లో కురుకుపోతున్నాయని చెప్పారు. కళాశాలల నిర్వహణ  కష్టం అవుతుందన్నారు. పేద పిల్లల ఉన్నత విద్య సజావుగా జరిగి బకాయిలను వెంటనే విడుదల చేసి ప్రైవేట్ కళాశాలలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు