పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి
09-09-2026 | 06:45pm
సత్తుపల్లి. సెప్టెంబర్ 9. (విజయ క్రాంతి): జనరల్ మేనేజర్ కార్యాలయo లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు(Kaloji Narayana Rao) జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎస్. వెంకటా చారి ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జీఎమ్తో పాటు పాల్గొన్న వివిధ విభాగాల అధిపతులు ( హెచ్ ఓ డి ఎస్ ), యూనియన్ ప్రతినిధులు మరియు అధికారులు కాళోజీ నారాయణ రావు స్మారకార్థం అక్షరాలను ఆయుధాలుగా మలిచి తెలంగాణ భాష, సంస్కృతుల ఆత్మగౌరవానికి ఆయన చేసిన సేవలను, "పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది" అన్న ఆయన స్ఫూర్తిదాయక సందేశాన్ని గుర్తుచేసుకుంటూ, అందరూ ఆయన ఆశయాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.