సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

20-09-2026 | 01:02pm

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి లబ్ధిదారుల కృతజ్ఞతలు

బోధన్, సెప్టెంబరు 20 (విజయక్రాంతి): బోధన్ మండలం(Bodhan Mandal) ఊటుపల్లి గ్రామానికి చెందిన తడపు రామకు శ్రేష్ట చికిత్స నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ గ్రామ ఉపసర్పంచ్ నరేందర్ గౌడ్ చేతుల మీద అందజేశారు. బోధన్ నియోజకవర్గంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister's Relief Fund) ద్వారా ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సహాయం అందేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. “ప్రజల సంక్షేమమే లక్ష్యం.. ప్రజా సేవే ధ్యేయం” అనే నిబద్ధతతో పనిచేస్తున్న ఎమ్మెల్యేకు తమ కృతజ్ఞతలు ఉంటాయని లబ్ధిదారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు