మహాభారతం భీముడిపై కేసు నమోదు!
పెళ్లి పేరుతో మోసం ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్
శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 20(విజయక్రాంతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఫిర్యాదుతో నటుడు, అంతర్జాతీయ రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌పై(International wrestler Saurav Gurjar) గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ముంబై విమానాశ్రయం ఎగ్జిట్‌లో అతన్ని అదుపులోకి తీసుకుని, శనివారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు.గచ్చిబౌలిలో నివసిస్తున్న 37 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(Software Engineer) ఆగస్టు మధ్యలో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చింది. కర్ణాటకకు చెందిన ఆమెకు 2016లో వివాహం జరిగి, తర్వాత విడాకులు తీసుకున్నారు. 2021లో అమెరికాలో ఉండగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సౌరవ్‌తో పరిచయం ఏర్పడిందని, వాట్సాప్‌లో సంబంధం పెరిగిందని ఫిర్యాదులో పేర్కొంది.డిసెంబర్ 25, 2021న తొలిసారి ప్రత్యక్షంగా కలిశామని చెప్పింది. భార్యకు ఉండే హక్కులన్నీ ఇస్తానని హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది.
కలిసి వ్యాపారం చేద్దామని ఒప్పించి అమెరికాలోని ఉద్యోగం వదిలేయించాడని, తర్వాత పెళ్లి గురించి అడిగినప్పుడల్లా ఫోన్ బ్లాక్ చేసి దూరంగా ఉండేవాడని తెలిపింది.2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి వరకు తనతో కలిసి ఉన్నాడని, గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓస్ కాలనీలో కూడా కొద్ది రోజులు నివసించాడని ఫిర్యాదు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఆమె ఆరోపించింది. శారీరక, మానసిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ముంబైలో పట్టుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ కె. సైదులు విచారణ చేపడుతున్నారు.సౌరవ్ గుర్జార్ మహాభారతం సీరియల్‌లో భీముడు పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు.