బీఆర్ఎస్ నేతల భూములపై కాంగ్రెస్ దండయాత్ర

20-09-2026 | 07:35am

అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో కాంగ్రెస్ నేతల పర్యటన

హైదరాబాద్: తెలంగాణలోని బీఆర్ఎస్ నేతల భూములపై కాంగ్రెస్ దండయాత్ర చేస్తోంది. రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్, మొయినాబాద్(Moinabad)లో కాంగ్రెస్ నేతలు ఆదివారం పర్యటించనున్నారు. టీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల భూములను క్షేత్రస్థాయిలో సందర్శించే అవకాశముంది. సర్వే నంబర్లు, పాత రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, భూసేకరణ పత్రాలు, శాటిలైట్ చిత్రాలను పరిశీలించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఎంపీలు(Congress MPs), ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నిన్న జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అటు సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్(KCR's Erravalli farmhouse) పరిసరాల్లో రెవెన్యూ శాఖ అధికారులు(Revenue Department officials) వరుసగా శనివారం మూడో రోజు సర్వే నిర్వహించారు. ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో భూ సర్వే కొనసాగుతోంది. మార్కూక్ మండలానికి చెందిన ఎర్రవల్లి, శివారు వెంకటాపురం, వరదరాజాపురం గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ సర్వే నంబర్‌లోని 388 ఎకరాల భూమి సరిహద్దులను, సర్వే, భూ రికార్డులను గుర్తించారు. ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) దోచుకున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తెలంగాణ అసెంబ్లీలో చేసిన వాఖ్యలతో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల భూములను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు