హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
20-09-2026 | 02:04pm
నిర్మల్ ,సెప్టెంబర్ 20 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సప్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన హార్ట్ కేర్ (Heart diseases) కేంద్రాన్ని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) ప్రారంభించారు. నిర్మల్ జిల్లావాసులకు గుండె వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలిపారు. గుండెజబ్బుతో బాధపడుతున్న వారు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా నిర్మల్ లో వైద్య సేవలు చేయించుకునేందుకు అవకాశం దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వప్న వైద్యులు డాక్టర్ నాలాం స్వప్న శశికాంత్, గుండె వైద్యులకు కిషన్, వైద్య సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.