అనుమానితుల గుర్తింపునకు కొత్త సాంకేతిక విధానం
నిర్మల్ నవంబర్ 4 (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల(SP Dr. G. Janaki Sharmila), ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) కొత్త మాడ్యూల్ ఉపయోగించుకున్నట్టు తెలిపారు. పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనసమూహాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ముఖాల ఆధారంగా గుర్తించే విధానంపై వివరించారు.
ఈ సాంకేతికత ద్వారా అనుమానిత వ్యక్తులను త్వరగా గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే NAFIS (National Automated Fingerprint Identification System) ద్వారా వేలిముద్రల ఆధారంగా వ్యక్తులను గుర్తించే విధానం గురించి వివరించారు. నేర పరిశోధనలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఫింగర్ ప్రింట్ యూనిట్ నిర్మల్ సిబ్బంది, డీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.