ఎమ్మెల్యే సతీమణి పూజలు
నిర్మల్ సెప్టెంబర్ 20 ( విజయ క్రాంతి): ప్రియదర్శిని నగర్ లోని ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg)అభివృద్ధి మరియు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, శ్రీ లక్ష్మీ గణపతి గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రముఖులు పూజలు చేశారు . అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఏలేటి కవితా రెడ్డి(MLA's wife Yeleti Kavita Reddy), మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, బార్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి , ప్రియదర్శిని నగర్ కౌన్సిలర్ గంజి రాజు, బోయవాడ కౌన్సిలర్ జింక సూరి, నిర్మల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మూర్తి ప్రభాకర్ మాజీ అధ్యక్షులు ముప్పిడి రవి, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మార్గ్ కాలనీ అధ్యక్షులు న్యాయవాది భూసారపు గంగాధర్, సెక్రెటరీ శివరాం వెంకటేష్, క్యాషియర్ చిటిమెల సదయ్య ఇతర కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, సభ్యులు మహిళలు ఉన్నారు.