భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు
20-09-2026 | 03:28pm
రాయికోడ్ సెప్టెంబర్ 20 విజయ క్రాంతి: మండల కేంద్రమైన రాయికోడ్ తో (Raicode)పాటు మండలంలోని వివిధ గ్రామాలలో వాడ వాడల ఏర్పాటుచేసిన మండపాలలో వినాయక విగ్రహాలకు మహిళలు యువకులు నిర్వాహకులు గణపతి మొప్పా మోరియా నామస్మరణతో గ్రామాలు మార్మోగినాయి చిన్నారులు ప్రజాప్రతినిధులు పెద్దలు భక్తులు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొనడంతో వినాయక మండపాలలో సందడి నెలకొంది గ్రామాలలో నెలకొల్పిన వినాయకులకు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు విజ్ఞాలు తొలగించి సుఖసంతోషాలతో చూడాలని గణేష్ ని వేడుకుంటారు ఆదివారం విఘ్నేశ్వరులు ఏడు రోజులు పూజలు అందుకొని అక్కడక్కడ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు