నందివాడలో గణనాథుడి శోభాయాత్రలో నృత్యాలు చేస్తున్న యువకులు
20-09-2026 | 03:44pm
ఘనంగా గణనాథుడి శోభాయాత్ర...
తాడ్వాయి,సెప్టెంబర్,20( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో నేతాజీ యూత్ క్లబ్ (Netaji Youth Club) ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడికి ఆదివారం శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభాయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం సభ్యులు గణనాథుడి పాటలు పాడుతూ నృత్యాలు నిర్వహించారు. యువకుల నృత్యాలు అందరిని అలరించాయి. రాత్రి గణనాథుడి నిమజ్జనం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు,కార్యదర్శి, కోశాధికారి, సభ్యులు పాల్గొన్నారు.