జోనల్ స్థాయి లో నిర్మల్ విద్యార్థుల ఎంపిక
20-09-2026 | 03:31pm
నిర్మల్, సెప్టెంబర్ 20 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో 70వ SGF U-14, U-17 బాలబాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపిక పోటీలు నిర్మల్లోని భూషణ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో (Bhushan Martial Arts Academy) నిర్వహించారు . ఈ ఎంపిక పోటీలు DEO డి. భోజన్న మరియు SGF ఆర్గనైజింగ్ సెక్రటరీ రాథోడ్ లక్ష్మణ్ ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ వయస్సు మరియు బరువు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. పీటీలు భూమన్న పెంటన్న అంబాజీ తదితరులు తదితరులు పాల్గొన్నారు.