ఎల్లన్న టీచర్ కు అరుదైన గౌరవం
19-09-2026 | 07:19pm
భైంసా ( విజయక్రాంతి) :తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) విద్యా ప్రమాణాలను పెంచేందుకు అంతర్జాతీయ విద్యపై పరిశోధనలకు వెళ్లిన బైంసా వానల్ పహాడ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిల్లలకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. విద్య బోధన నైపుణ్యత అంతర్జాతీయ విద్య మార్పిడి పై సింగపూర్లో ప్రతిభ కనబరిచారు. సింగపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (National Institute of Technology Singapore) మిస్టర్ విభన్ లీన్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అంతకుముందు సింగాపూర్ ప్రతినిధులతో అంతర్జాతీయ విద్య మార్పిడి పై చర్చించినట్టు తెలిపారు. విద్యాశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు.