డివైడర్ లైటింగ్ పనులను,నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality)పరిధిలో కొనసాగుతున్న సెంటర్ డివైడర్ లైటింగ్ పనులను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. లైటింగ్ పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిమజ్జన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, తాగునీరు, భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రత్యేకంగా యువతకు ఒక విజ్ఞప్తి చేశారు నిమజ్జనం సమయంలో ఉత్సాహంతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా ఊరేగింపు నిర్వహించాలి. చెరువులు, కాలుష్యం విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పర్యావరణహితంగా నిమజ్జనం జరుపుకోవాలి అని చైర్మెన్ అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె జగ్జీవన్
వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొని నిమజ్జన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.