సహకార శాఖ అభివృద్ధికి కృషి చేయాలి: టీఎన్జీవో జిల్లా నేత నవీన్

19-09-2026 | 07:43pm

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పదోన్నతి పొందిన ఉద్యోగులు(Employees) మంచిగా పని చేసి సహకార శాఖ అభివృద్ధికి కృషి చేయాలని టీఎన్జీవో(TNGO) జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ కోరారు. ఇటీవల సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతులు(Promotions) కల్పిస్తూ అడిషనల్ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు పదోన్నతులు పొందిన దిరేష్, శరత్, ఆశా జ్యోతి లను టీఎన్జీవో యూనియన్, గెజిటెడ్ అధికారుల సంఘం సన్మానించి అభినందించారు.  

మరిన్ని వార్తలు