ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ నూతన జిల్లా కమిటీల నియామకం

19-09-2026 | 07:47pm

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు నూతన జిల్లా యువజన అధ్యక్షులను నియమించారు. జాతీయ ఎన్వైసీ అధ్యక్షులు శ్రీ ధీరజ్ శర్మ(National NYC President Mr. Dheeraj Sharma)  ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈరోజు జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు చేతుల మీదుగా నూతనంగా నియమితులైన వారు బాధ్యతలు స్వీకరించారు.

గాజుల కుమారస్వామిను వరంగల్ జిల్లా(Warangal District) యూత్ ప్రెసిడెంట్‌గా, చెవుగాని మహేష్ను మహబూబాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ సలహాదారు రాజులపాటి ఐలయ్య ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులకు మద్దిశెట్టి సామేలు అభినందనలు తెలిపారు. జిల్లాల్లో పార్టీ యువజన విభాగాన్ని బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు