7 September, 2026 | 12:51 PM

కృష్ణ, గోదావరిలో వాటా వదులుకోం!

07-09-2026 | 05:30am
  1. తెలంగాణ న్యాయబద్ధమైన వాటా సాధించి తీరుతాం
  2. ట్రైబ్యునళ్లు, కేఆర్‌ఎంబీ ఎదుట సమర్థ పోరాటం
  3. లక్షల కోట్లు ఖర్చుచేసినా కీలక ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారు
  4. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, వాస్తవ ఆయకట్టు సృష్టి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  5. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్/ గరిడేపల్లి సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటా సాధించేందుకు ప్రజాప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister of Irrigation and Civil Supplies Uttam Kumar Reddy) పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి మండలంలోని ఆర్-9 ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. నదీ జలాల పరిరక్షణ కోసం ట్రైబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఎదుట సమర్థంగా పోరాడుతామని తెలిపారు. 

నీటి పారుదల, జల నిర్వహణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. ప్రజా ప్రభుత్వం సాగునీటి వ్యవస్థలను, వ్యవసాయ విద్యుత్ అవసరాలను సమర్థంగా నిర్వహిస్తోందని తెలిపారు.అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును రైతుల ప్రయోజనాలకు ఉపయోగించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసినా కీలక ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల లక్ష్యాన్ని నెరవేర్చడంలో గత ప్రభుత్వం 

ప్రభుత్వం విఫలమైందన్నారు. పాలమూరు  రంగారెడ్డి ఎత్తిపోతలతోపాటు పలు ప్రాజెక్టులు అసంపూర్తిగానే మిగిలిపోయాయన్నారు. 

ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టే సాక్ష్యమన్నారు. కాగితాలపై ఖర్చుల లెక్కలు పెరిగినా, క్షేత్రస్థాయిలో రైతుల పొలాలకు చేరిన నీరు, సాగులోకి వచ్చిన ఆయకట్టు మాత్రం అందుకు అనుగుణంగా లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం, వాస్తవ ఆయకట్టును సృష్టించడం, విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించడం, కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ జలహక్కులను పరిరక్షించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని వివరించారు. ప్రాజెక్టు పరమార్థం నిర్మాణాల్లో కాదని, రైతుల పొలాల్లో పచ్చని పంటల రూపంలో ప్రతిఫలించాలని పేర్కొన్నారు. 

ఆర్-9 ఎత్తిపోతల పథకం ఉపయోగం,నిర్వహణ తీరును సమీక్షించారు.అందుబాటులో ఉన్న నీరు ఎలాంటి వృథా,అనవసర జాప్యం లేకుండా రైతుల పొలాలకు చేరేలా సాగునీటి మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్  నాగభూషణం పాల్గొన్నారు.

ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలి

ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఆదివారం ముత్యాలమ్మ జాతరను సందర్శించి పూజలు నిర్వహించారు. హుజూర్ నగర్ ప్రాంతంలో ముత్యాలమ్మ తల్లి జాతరకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చెర్మన్ తన్నీరు మల్లీఖార్జున్ రావు, ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి,యరగాని నాగన్న,వేముల నర్సయ్య,తండు సైదా రత్నం,ప్రసాద్,గుండా రమేష్,మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

రహదారులే గ్రామాల అభివృద్ధికి మూలాలు

రహదారులే పల్లెల అభివృద్ధికి మూలాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. గరిడేపల్లి మం డలం గడ్డిపల్లిలో బొలిశెట్టి వారిగూడేనికి 7 కోట్ల 20 లక్షల తో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాణ్యత ప్రమా ణాలు పాటించి బీటీ రోడ్డు ను నిర్మించాలని అధికారులను ఆదేశించా రు. అనంతరం గడ్డిపల్లిలో 200 కోట్లతో ని ర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు త్రిపురం అంజన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లు పైడిమర్రి రంగనాథ్, గోపాల్, మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్‌గౌడ్, సత్యనారాయణ, సుందరి నాగేశ్వరరావు, మూల గుం డ్ల సీతారాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు