మియామీలో విమాన ప్రమాదం.. ఐదుగురు మృతి
07-09-2026 | 08:50am
అమెరికా: అమెరికాలోని మియామీ(Miami)లో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్గో విమానం(Cargo plane) రన్‌వేపై అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
