7 September, 2026 | 12:51 PM

తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ప్రొఫెషనల్ గ్రూప్ ఇన్‌చార్జిగా శోభన్‌బాబు

07-09-2026 | 11:22am

మహబూబాబాద్(విజయక్రాంతి): ఆదివాసి కాంగ్రెస్ ప్రొఫెషనల్ గ్రూప్9Adivasi Congress Professional Group) తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా మహబూబాబాద్(Mahabubabad) జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లికి చెందిన భూక్య శోభన్ బాబు నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్, కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, తెలంగాణతో పాటు మహారాష్ట్ర కు ఇన్చార్జిగా అదనంగా మరో కీలక బాధ్యత అప్పగించారు.

జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆదివాసీ కాంగ్రెస్ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ, వార్‌రూమ్ కార్యకలాపాలు, విద్యార్థి, యువజన కార్యక్రమాలు, ఆదివాసీ హక్కుల ఉద్యమాలు, జాతీయ సమావేశాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్న శోభన్‌బాబుకు కాంగ్రెస్​ పార్టీకి కీలకమైన  రెండు కీలక రాష్ట్రాల్లో ఆదివాసీ ప్రొఫెషనల్స్‌ను సమన్వయం చేసే బాధ్యతను అధనంగా అప్పగించారు.

ఈ సందర్భంగా భూక్య శోభన్‌బాబు మాట్లాడుతూ: “ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా, కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నాకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, ఎన్నికల కార్యక్రమాల్లో పనిచేసే అవకాశం లభించింది. ఇప్పుడు అదనంగా తెలంగాణ, మహారాష్ట్ర ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూప్ బాధ్యతలు అప్పగించడం మరింత బాధ్యతను పెంచిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన కన్వీనర్ అడ్వకేట్ అర్చనా పొత్రే, ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డా. విక్రాంత్ భూరియా, కె. రాజు, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు