నేరేడ్ మెట్ లో ట్రాఫికర్!
- ఆర్‌కే పురం బ్రిడ్జిపై నిత్యం ట్రాఫిక్ జామ్
- కానరాని ట్రాఫిక్ పోలీసుల జాడ
- ట్రాఫిక్ మళ్లింపు చర్యలు శూన్యం
మల్కాజిగిరి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మల్కాజిగిరి ప్రాంతంలో(Malkajgiri area) రైల్వే అండర్ బ్రిడ్జి(railway underbridge)ల నిర్మాణం కారణంగా ఈసీఐఎల్ నుంచి తిరుమలగిరి మార్గంలో నిత్యం ట్రాఫిక్ జామ్(traffic jam)తో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నేరేడ్మెట్ పరిధిలోని రామకృష్ణా పురం (ఆర్ కె పురం) బ్రిడ్జిపైన రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో ఆయా మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు(passengers) తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు.
ఆర్కె పురం ఫ్లైఓవర్ చిన్నదిగా ఉండ టంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. యూటర్న్ వద్ద భారీ వాహనాలు, చెత్త లారీలు నిలిచి పోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ చిక్కుకుంటున్నా మని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని వాజ్ పేయి నగర్ లో రూ 74.47 కోట్ల వ్యయంతో చేపడుతున్న అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమైనాయి.
అదే విధంగా సఫిల్ గూడ రైల్వే గేటు మార్గం మూత పడింది. దీంతో మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. దీంతో అటు సఫిల్ గూడ , ఇటు వాజపేయి నగర్,ఇటు కాకతీయ నగర్ నేరేడ్ మెట్, ఏఎస్ రావు నగర్ , ఈసీఐఎల్ తదితర ప్రాంతాల వారు ఆర్ కే పురం రైల్వే బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
ఉద్యోగుల వేదన
నగరంలోని వివిధ ప్రాంతాలకు ఉద్యోగాలు, పనుల నిమిత్తం రాకపోకలు సాగించే వాహనదారులు సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఏఓసీ తదితర ప్రాంతాలకు వెళ్ళా లంటే ఆర్ కే పురం బ్రిడ్జి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్ కే పురం బ్రిడ్జి మీద ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది.
ఆర్ కే పురం బ్రిడ్జి కి అటు, ఇటూ రెండు కిలో మీటర్లు ప్రధాన రహదారి మార్గం కూడా ట్రాఫిక్ తో కిక్కిరిసి పోతుంది. అసలే ఆర్ కే పురం బ్రిడ్జి చాలా చిన్నది. దీనికి తోడు వాజపేయి నగర్ లో ఆర్ యుబీ నిర్మాణం పనులు కారణంగా వాహనదారులు మళ్ళించిన మార్గాలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుంది.
ఆర్‌కే పురం బ్రిడ్జి విస్తరణ
ఆర్ కే పురం బ్రిడ్జి విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.960 కోట్లు కేటాయించింది. నేరేడ్ మెట్ నుంచి ఏఓసీ వరకూ ఆర్ కే పురం బ్రిడ్జి విస్తరణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నా , పరిష్కారం కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు కానరావడం లేదు. ఎక్కడా ట్రాఫిక్ డైవర్షన్ సైడ్ బోర్డ్ లు ఏర్పాటు చేయ లేదు. పోలీసులు డ్యూటీ చేస్తున్న దాఖలు కాన రావడం లేదు.
ఓల్ నేరేడ్ మెట్, ఆర్ కే పురం చెరువు రైతుబజార్ మార్గం ద్వారా వాహనా లను ఆర్ కే పురం బ్రిడ్జి కింది నుంచి వెళ్ళే విధంగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసు కోవాలని పలువురు కోరుతున్నారు. ఇకనైనా అధికా రులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని స్ధానికులు కోరుతున్నారు.
ఇబ్బంది లేకుండా చూస్తాం
వాజ్పేయి నగర్, అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అలాగే గౌతమ్ నగర్ ఏఓసి వెళ్లే దారిలో రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. కాబట్టి వాహనదారులు కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. త్వరలోనే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం.
నరసింహ, ట్రాఫిక్ సీఐ






