5 September, 2026 | 2:44 AM

మహిళల హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరుబాట

05-09-2026 | 12:15am

కొత్తపేటలో భారీ ర్యాలీ.. రూ.2,500 ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలి

కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను పునరుద్ధరించాలి: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

నాగోల్,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌ పోరుబాటలో భాగంగా కొత్తపేట డివిజన్‌లో మహిళల పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఓమిని హాస్పిటల్‌(Omni Hospital) నుంచి జైన్‌ మందిర్‌ వరకు మహిళా నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) పాల్గొని, మహిళలకు ఇచ్చిన రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళల హక్కులు(Women's rights), సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు