5 September, 2026 | 5:48 AM

మంత్రి వర్గంలో మరో బెర్త్ దక్కేనా?

05-09-2026 | 04:55am

ఉమ్మడి జిల్లాలో 9 కి చేరిన కాంగ్రెస్ బలం

ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఇద్దరు విప్ లు

మంత్రి పదవి ఆశిస్తున్న జిల్లా ఎమ్మెల్యేలు

కరీంనగర్, సెప్టెంబర్4 (విజయక్రాంతి): కొండా సురేఖ(Konda Surekha)కు మంత్రి పడవినుండి భర్తరఫ్ చేయడంతో మంత్రివర్గంలో ఖాళీల సంఖ్య మూడుకు చేరింది. త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉండటంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర మంత్రిబార్గంలో ఉమ్మడి జిల్లానుండి ముగ్గురు  ఉన్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణ లు పరిగణలోకి తీసుకుంటే తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో ఎమ్మెల్యేలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 2023 ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోగా అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో బలం 9 కి పెరిగింది.

ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఇప్పటికే దుద్దిళ్ల శ్రీధర్ బాబు (ఓసీ), పొన్నం ప్రభాకర్ (బీసీ), అడ్లూరి లక్ష్మణ్ కువ 4 (ఎస్సీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావులు ప్రభుత్వ విప్ లు గా కొనసాగుతున్నారు. పార్టీ నుండి గెలిచిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యే లలో మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ ఎస్ సి సెల్ రాష్ట్ర అధ్యక్షునిగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందన్న ఆశలో ఉన్నారు. కాపు సామాజికవర్గానికి అవకాశం ఇస్తే తనకు ఇవ్వాలని అది శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వెలమ సామాజికవర్గం నుండి ఓక్లరే ఉన్నందున ఉమ్మడి జిల్లా లో రాజకీయంగా బలంగా ఉన్న వెలమ సామాజికవర్గం నుండి తనకు అవకాశం వస్తుందన్న ఆశతో రెండవసారి ఎమ్మెల్యే అయిన చింతకుంట విజయ రమణా రావు ఉన్నారు. ఎస్ సి సామాజిక వర్గంకు చెందిన అడ్లూరి లక్మన్ కుమార్ ను స్పీకర్ గా ప్రమోట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటం తో ఇదే సామాజిక వర్గానికి చెందిన సి ఎం రేవంత్ రెడ్డి అనుచరులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లు మంత్రి పదవి ఆశతో ఉన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి విధేయుడుగా పేరు తెచ్చుకున్న మక్కాన్ సింగ్ కూడా మంత్రి పదవి ఆశతో ఉన్మారు. కొండా సురేఖ ను భర్తరఫ్ చేసిన అనంతరం బి సి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మహిళలకు కీలక పదవులు కట్టబెట్టారు. ఇందులో మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నెరేళ్ల శారద ది కరీంనగర్ జిల్లా . పెద్దపల్లి జిల్లా నుండి అరకాల వేణుగోపాల్ ప్రభుత్వ సలహా దారుగా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణలో చోటు కష్టమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా కులాల సమీకరణ లో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఆశావాహులు ఉన్నారు.

మరిన్ని వార్తలు