5 September, 2026 | 9:41 AM

పైసలు రానిది.. పనులు ఎట్లా చేయాలే

05-09-2026 | 05:45am
  1. మంజూరు 22.. ప్రారంభమై ఆగిన 21 భవనాలు
  2. చేసిన పనులకే దిక్కులేదు... పూర్తి చేస్తే ఇచ్చేది ఎవరు?
  3. పూర్తి చేసేందుకు అక్టోబర్ డెడ్ లైన్ పెట్టిన సర్కార్ 
  4. భవనాలు అంటూ సంబరం.. అంతలోనే నిర్మాణం కదలట్లే
  5. మహిళా సమైక్య భవనాల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో 
  6. పర్యవేక్షణ చేస్తున్నాం : ఎండీ మూతీన్, పంచాయతీరాజ్ ఏఈ, మహమ్మదాబాద్ 

మహమ్మదాబాద్, సెప్టెంబర్ 4 : ప్రభుత్వం ఏదైనా మహిళలకు సముచిత స్థానం ఇస్తూ వస్తుంది. ఉచిత బస్సు నుంచి ఇందిరమ్మ ఇల్లు(Indiramma houses), రేషన్ కార్డు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకంలోనూ మహిళలకు గౌరవం ఇస్తూ వారికి అండగా ఉన్నామంటూ ప్రత్యేకంగా చెబుతుంది.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు ఐక్యంగా ఉంటూ రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లిస్తూ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తు ధైర్యంగా అడుగులు వేస్తుండ్రు. ముఖ్యంగా మహిళా సమైక్య భవనాలు నిర్మించి మహిళలకు సముచిత గౌరవం అందించేలా ప్రతి సమావేశాలను నిర్వహించుకునేందుకు మండల పరిధిలో 22 భవనాలను మంజూరు చేసింది. ప్రతి భవన నిర్మాణానికి రూ 10 లక్షలు ఇస్తామని సంబంధిత కాంట్రాక్టర్లకు చెప్పినట్లు తెలుస్తుంది.

కాగా 21 గ్రామాలలో మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభమైనప్పటికీ ఐదు చోట్ల స్లాబ్ దశకు చేరిన, మిగతా ప్రాంతాలలో నిర్మాణ దశలో ఆగాగ, గాదిర్యాల గ్రామంలో స్థలం అందుబాటులో లేదని ప్రారంభం కాలేదు. భవన అవకాశం వచ్చింది అని సంబరపడిన సదరు కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురి అవుతూ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేసిన పరిస్థితి మండల వ్యాప్తంగా చర్చనీయంశమైంది.

కాగితాలకు పరిమితం చేస్తే.. భవనాలు పూర్తవుతయా?

మహిళాలు ప్రతి సమావేశంలో ఎవరో ఒక ఇంటిదగ్గర చేసుకుంటూ వారు సాధకబాధకాలు పడుతున్నారు. మండలంలో 22 గ్రామాలలో భవనాలు నిర్మించింది ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇక మాకు సమస్య ఉండదనుకొని ఆశించిన మహిళలకు భవనాలు అసంపూర్తిగా నిర్మాణ దశలోనే ఆగిపోవడంతో అసలు ప్రారంభం అవుతాయా? లేదా? అనే అసహనం వ్యక్తం చేస్తుండ్రు.

ప్రజా నిత్యం మండల పరిధిలో పర్యటనలు చేస్తున్నప్పటికీ నిర్మాణ దశలో ఆగిన మహిళ సమాఖ్య భవనాల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదని మహిళలు చెబుతున్న మాట. చేసిన పనుల కాడికి బిల్లులు రావడం లేదని పూర్తిచేస్తే అవి కూడా రాకుంటే ఏమి చేయాలని నిర్మాణాలు చేపట్టిన వారు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. అందుబాటులో ఉన్న నేతలకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇబ్బందులు చెప్పలేనని.. పూర్తి చేస్తేనే మేలు..

మహిళా సంఘాల బలోపేతం నిమిత్తం నిర్మిస్తున్న ఈ భవనాల విషయంలో అసంపూర్తిగా ఆగిపోవడంతో చెప్పలేనని ఇబ్బందులు పడుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరైన 22 మహిళా సమాఖ్య  భవనాలను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసి మహిళలు సమావేశాలు నిర్వహించు కునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారు కోరుతుండ్రు. ప్రభుత్వమే అక్టోబర్ చివరిలోపు ఈ భవనాలు పూర్తి చేయాలని చెబుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

పర్యవేక్షణ చేస్తున్నాం

బాగున్నారు నిర్మించాలని పర్యవేక్షణ చేస్తున్నాం. నిర్మాణాలు చేసే వారిపై ప్రెషర్ పెట్టి త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం.

ఎండీ మూతీన్, 

పంచాయతీరాజ్ ఏఈ, మహమ్మదాబాద్

మరిన్ని వార్తలు