5 September, 2026 | 8:26 AM

డేటా, ఏఐ రంగాలదే భవిష్యత్

05-09-2026 | 05:20am

డేటా, ఏఐ, కంటెంట్ రంగాలకు స్వర్ణయుగం రాబోతున్నది

n టైర్--2, టైర్--3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల

n కాన్‌స్టర్ కార్యాలయం 

ప్రారంభోత్సవంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతున్నదని, డేటా, ఏఐ రంగాలదే(Data, AI sectors) భవిష్యత్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) స్పష్టంచేశారు. ముఖ్యంగా డేటా, డేటా సెంటర్లు(data centers), సర్వర్లు, కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) (ఏఐ), కంటెంట్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పరిశ్రమ రెండు రంగాల కోణాల నుంచి రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని అత్యం త దగ్గరగా చూసిన అనుభవంతో చెబుతున్నానని, ప్రస్తుతం ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి అద్భుతమైన భవిష్యత్ ఉందని వెల్లడించారు.

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌(Hyderabad Financial District)లోని ఫీనిక్స్ ప్రైమియా భవనంలో కాన్‌స్టర్ సొల్యూషన్స్ కంపెనీ(Constor Solutions company) నూతన కార్యాలయా న్ని కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అ నంతరం సంస్థ సీనియర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు కంపెనీ కార్యకలాపాలు, వ్యాపార విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలను కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడు తూ.. తాను కూడా రెండు దశాబ్దాల క్రితం కార్పొరేట్ ప్రపంచంలో పనిచేశానని, అమెరికాలో విద్యాభ్యాసం చేసి అక్కడ కొంతకా లం ఉద్యోగం చేసిన అనుభవం ఉందని గు ర్తుచేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ టైమ్‌జోన్లలో పనిచేస్తూ, అనేక దేశాల ఖాతాదారులతో కలిసి పనిచేయడం ఎంతటి సవా లో తనకు తెలుసన్నారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ టైర్--2, టైర్-3 నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు.

తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టైర్- నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ సంస్థ వ్యవస్థాపకులు, నాయకత్వ బృందం, ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతూ  మరింత ఎదగాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు