కొండా సురేఖ కాంగ్రెస్‌లో కొనసాగితే అవకాశం ఇస్తాం: మహేష్ కుమార్
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని, ఆమె పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా బహిరంగంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడితే కాంగ్రెస్ అధిష్ఠానం(Congress High Command) సహించదని స్పష్టం చేశారు.
కొండా సురేఖ(Konda Surekha) తీరు ఆక్షేపణీయంగా ఉండటంతోనే ఆమెపై చర్యలు తీసుకున్నామని మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. నిన్న ఆమె ఆవేశం, ఆవేదనతో మాట్లాడారని పేర్కొన్న ఆయన.. ఇకపై అలా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీలో ఎవరికైనా సమస్యలు, ఆవేదన లేదా ఇబ్బందులు ఉంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడిని కలిసి చెప్పుకోవచ్చని మహేశ్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. అలాగే ఏఐసీసీ ఇన్‌చార్జ్, జనరల్ సెక్రటరీ, పార్టీ అధిష్ఠానాన్ని కలిసి తమ సమస్యలను వివరించవచ్చని తెలిపారు.పార్టీలో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉన్నట్లే.. క్రమశిక్షణ విషయంలోనూ అంతే కఠినంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. బహిరంగంగా ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని తేల్చిచెప్పారు.
కొండా సురేఖపై తీసుకున్న చర్య బాధాకరమేనని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అయితే పార్టీ క్రమశిక్షణను కాపాడాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉందన్నారు.ఏ కాంగ్రెస్ నాయకుడైనా హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో కూడా కొండా సురేఖ విషయంలో రెండుసార్లు అవకాశం ఇచ్చామని తెలిపారు. ఆమె హద్దులు మీరినట్లు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను ఏఐసీసీ పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందని మహేశ్ గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు.
చిన్నారెడ్డి, కొండా సురేఖ విషయంలో పార్టీ చర్యలు తీసుకుందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. క్రమశిక్షణ విషయంలో కులం, మతం, ప్రాంతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకూడదన్నారు.ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే.. వారు ఎంత పెద్ద నాయకులైనా కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
కొండా సురేఖ కాంగ్రెస్‌లో కొనసాగితే భవిష్యత్తులో ఆమెకు తప్పకుండా అవకాశం ఇస్తామని మహేశ్ గౌడ్ తెలిపారు. అయితే ఇకపై పార్టీ వేదికలపై లేదా బహిరంగంగా మాట్లాడే విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేసినట్లయింది. ఒకవైపు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెబుతూనే.. మరోవైపు కొండా సురేఖ కాంగ్రెస్‌లో కొనసాగేందుకు అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.






