బీసీలను అణగదొక్కుతున్న కాంగ్రెస్
- కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం సరికాదు
- బీసీలు స్వతంత్రంగా రాజకీయంగా ఎదగాలి
- మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు
ముషీరాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాం తి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) 76 ఏళ్ల పాలనలో బీసీలను రాజకీయంగా అణగదొక్కుతూ వచ్చిం దని బీసీ మేధావుల ఫోరం(BC Intellectuals Forum) చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు(T. Chiranjeevi) ఆరోపించారు. బీసీల జనాభా దామాషా(Population Ratio) ప్రకారం రాజకీయ పదవులు(Political Positions), విద్య(education), ఉద్యోగాలు(jobs), పరిశ్రమలు(industries) తదితర అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం(Telangana BC Welfare Association) రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ(Erra Satyanarayana), హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత సతీష్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ కబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చిరంజీవులు విమర్శించా రు. రాజకీయంగా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుని ఎదుగుతున్న కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు.
బీసీ నాయకులపై వివక్ష చూ పడం కాంగ్రెస్ పార్టీ నైజంగా భావిస్తున్నామన్నారు. గతంలో తీన్మార్ మల్లన్న, పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులపై కూడా కాంగ్రె స్ పార్టీ చర్యలు తీసుకుందని ఆయన గుర్తుచేశారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఈటల రా జేందర్ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఏర్పడిందన్నారు.బీసీ బిడ్డలు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పుకోకూడదా అని ప్రశ్నించిన చిరంజీవులు, బీసీలు ఇక పార్టీల జెండాలు మోసే స్థాయిలో కాకుండా స్వతంత్రంగా రా జకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ రెడ్డి, రావుల దుర్మార్గాలకు, అత్యాచారాలకు బీసీ ల బహుజన రాజ్యాధికార స్థాపన ఒకటే ముగింపు అని అన్నారు. ఈ నెల 29న బీసీ బహుజన ఉద్యమకారుల సమావేశం ఏర్పా టు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీసీ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యవస్థా పక అధ్యక్షుడు వీజీఆర్ నారగోని, బీసీ జాక్ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, మన ఆలోచన సమి తి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నరసింహా రావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రావు, బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు.






