బీజేవైఎం కార్యకర్తల ముందస్తు అరెస్ట్
07-09-2026 | 07:38pm
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణంలో విద్యార్థుల(Students) ఫీజు బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో బిజెవైయం ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరే విద్యార్థి నాయకులను తెలవారక ముందు నుంచే గృహ నిర్భంధం, ప్రివెంటివ్ అరెస్టులు చేసి పోలీసుస్టేషన్ లకు పోలీసులు తరలించారు. ప్రభుత్వ నిర్భంధ అక్రమ అరెస్ట్ లపై మంచిర్యాల బిజెవైయం జిల్లా అధ్యక్షుడు ఏతం శివక్రిష్ణ మండిపడ్డారు. ఈ అరెస్టులతో కార్యక్రమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
