అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా తిరుపతి

07-09-2026 | 07:29pm

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) గా బీ తిరుపతి సోమవారం స్థానిక ఏడీ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వహించిన ప్రభాకర్  పదోన్నతిపై బెల్లంపల్లికి బదిలీ అయ్యారు. కాగా, హనుమకొండ కార్పొరేట్ కార్యాలయం(Hanumakonda Corporate Office) నుంచి బదిలీపై వచ్చిన నూతన ఏడీఈ లక్షేట్టిపేట డివిజన్ లోని దండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట మండలాలను పర్యవేక్షిస్తారు. నూతన ఏడీఈ తిరుపతిని సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు