కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

07-09-2026 | 07:34pm

బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం సోనాల గ్రామ సర్పంచ్ బిందుజ సుధీర్ రెడ్డి పట్టణ బిఆర్ఎస్(BRS) అధ్యక్షులు చిన్నయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు తాసిల్దార్ మల్లేష్, ఎంపీడీవో రత్నాకర్ రావులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన చేసిన హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తక్షణమే హామీ లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈర్ల అభిలాష్, హరీష్ ,అఖిల్, ప్రదీప్, రాజన్న ,సుగుణాకర్ ,శరత్ గణేష్ ,పంచాక్షరిలు ఉన్నారు

మరిన్ని వార్తలు