ఈనెల 13న భూమి పూజ

07-09-2026 | 08:38pm

భూమి పూజకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వేల సంఖ్యలో ఆర్యవైశ్య ప్రతినిధులు తరలి రావాలి

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పిలుపు

ఉప్పల్,(విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ భగాయత్(Uppal Bhagayat) లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నిర్మించే ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన(Arya Vaishya Self-Respect Building) సముదాయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్య వైశ్యులు వేలాదిగా తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఉప్పల్ బగాయత్ లో జరిగిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమరవాది మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన నిర్వహించే భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఆర్యవైశ్య సోదరీ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి జిల్లాలోని ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు బాధ్యత వహించి అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని వైశ్యుల సత్తా ను చాటాలని, రాబోయే ఎన్నికల్లో మన ఐక్యత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అంగరంగ వైభవంగా నిర్మాణం జరగనుందని ఆయన వివరించారు. భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కీలక భూమిక పోషించాలని అధ్యక్ష కార్యదర్శులు బెలీదే రమేష్ గుప్తా, బచ్చు నగేష్ గుప్తా లకు సూచించారు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ బగాయతులో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ భవన సముదాయం ఏర్పాటు కావడం జిల్లాకే గర్వకారణమని మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి బెలిదే రమేష్ గుప్తా , బచ్చు నగేష్ గుప్త లు అన్నారు. భవన సముదాయ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా కీలకపాత్రను పోషిస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ ఈనెల 13న జరిగే భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నందున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కేటాయించిన ఉప్పల్ భగత్ స్థలంలో ఉదయం 8 గంటలకు శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నామని దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు అని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో పొలిటికల్ కమిటీ చైర్మన్ అగ్రి వెంకటేష్, మాజీ కోశాధికారి నేతి రాములు, ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు భేలిదే రమేష్, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్ కుమార్, మెంబర్ షిప్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ అనిల్ బాబు, కాసం వెంకట హరి, పెద్ది శ్రీనివాస్, తారకేష్, రమేష్,  క్కుమల్ల రమేష్, పొద్దుటూరు నర్సింగరావు, సత్యనారాయణ, పవన్, సుధాకర్, శ్రీను, సంతోష్ రాష్ట మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి సామ్రాజ్య లక్ష్మి, ఉపాధ్యక్షురాలు బచ్చు సుదీప, భేలిదే వసంత, బచ్చు సరిత, పోలా చందన, శిరీష, వివిధ మండలాల, పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, కోశాధికారులు, సభ్యులు, ఆర్యవైశ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు