అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.లక్ష ఆర్థిక సాయం
04-09-2026 | 11:53pm
కల్వకుర్తి: చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమైన కల్వకుర్తి మండలం ముకురాల గ్రామానికి చెందిన నిరంజన్‌కు ఐక్యత ఫౌండేషన్(Unity Foundation) చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి(Task COO Sunkireddy Raghavendar Reddy) అండగా నిలిచారు. శుక్రవారం నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని(Financial assistance) అందజేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ కుటుంబంపై ఆర్థిక భారం పడటంతో, ఆయన భార్యకు ఉపాధి కల్పించి కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం అందించినట్లు రాఘవేందర్ రెడ్డి తెలిపారు. నిరంజన్ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.






